వేట మొదలు పెట్టిన “పుష్ప” రాజ్..!

వేట మొదలు పెట్టిన “పుష్ప” రాజ్..!

Published on Dec 13, 2022 10:18 PM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “పుష్ప” సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి దీనికి సీక్వెల్ అయినటువంటి పుష్ప ది రూల్ పై పాన్ ఇండియా లెవెల్లో మరింత స్థాయిలో నెలకొన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరి ఇది అలా వాయిదా పడుతూ వస్తుండగా ఇప్పుడు ఫైనల్ గా చిత్రం షూటింగ్ అయితే స్టార్ట్ అయ్యినట్టుగా తెలుస్తుంది. దీనితో అయితే ఫైనల్ గా పుష్ప రాజ్ వేట మొదలైంది అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమాలో మళయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటిస్తుండగా ఈ చిత్రంలో మరింతమంది బిగ్ స్టార్స్ పాన్ ఇండియా వైడ్ కనిపించనున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మోవి మేకర్స్ మరియు సుకుమార్ లు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు