
ఒకరేమో జనం కోసం జనం పడుతున్న ఇబ్బందులను కళ్ళకు కట్టినట్లు చూపించి ఎన్నో సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తున్న నటుడు మరియు పీపుల్స్ స్టార్ నారాయణమూర్తి. మరొకరేమో తన స్టైల్, యాక్టింగ్ మరియు తన భావాలతో నేటి యువతకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడం లేదు కానీ పవర్ స్టార్ సాంగ్ ని లాంచ్ చేయడం కోసం మొదటిసారి నారాయణమూర్తి వేరొక సినిమా ప్రమోషనల్ ఈవెంట్ కి హాజరవుతున్నాడు. ఇంతకీ ఏమిటా సినిమా అని అనుకుంటున్నారా..? మీకు తెలిసిందే, మేము ఇది వరకు చెప్పిందే…
మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన సినిమా ‘రేయ్’. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవన్ కళ్యాణ్ పై ‘పవనిజం’ అంటూ సాగే ఓ పాటని కంపోజ్ చేసారు. ఈ పాటని ఈ రోజు సాయంత్రం 6గంటలకు రిలీజ్ చేయనున్నారు. అది కూడా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి చేతుల మీదుగా లాంచ్ చేయనున్నారు. వైవిఎస్ చౌదరి దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా నటించారు. చక్రి సంగీతం నడించాడు. ఈ సినిమాని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

