‘తొలిప్రేమ’ కోసం బరువు తగ్గిన రాశీఖన్నా !

7th, February 2018 - 04:12:59 PM

ఈతరం హీరోయిన్లందరూ బాలీవుడ్లోకి వెళ్లేందుకు బరువు తగ్గుతుంటే రాశీఖన్నా మాత్రం తెలుగు సినిమా కోసం బరువు తగ్గారు. నూతన దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన సినిమా ‘తొలిప్రేమ’. ఇందులో రాశీఖన్నా హీరోయిన్ గా నటించారు. ట్రైలర్లో చాలా సన్నగా కనబడిన రాశీఖన్నా ఈ సినిమా కోసమే కావాలని బరువు తగ్గారట.

సాధారణంగా రోజుకి గంటపాటు వ్యాయామం చేసే తను ఈ సినిమాలో పాత్ర కోసం ఇంకో అరగంట ఎక్కువ కష్టపడి 5 కిలోల వరకు తగ్గారట. చిత్రంలో 19 ఏళ్ల అమ్మాయిగా కనబడాల్సి ఉండటం వలన ఈ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అని అన్నారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు.