ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో రాశీఖన్నా

Published on Jun 30, 2019 2:27 pm IST

‘తొలిప్రేమ’ తర్వాత తెలుగులో చెప్పుకోదగిన సక్సెస్ అందుకోలేకపోయిన రాశీఖన్నా తమిళనాట మాత్రం టాలెంట్ చూపుతోంది. ‘ఇమైక్క నొడిగల్, అడంగ మరు, ఆయోగ్య’ సినిమాలతో మెప్పించిన ఆమెకు వరుస ఆఫర్లు చేతిలో ఉన్నాయి. తమిళ సినిమాల ప్రభావంతో తెలుగులో కూడా ఆమెకు ఆఫర్లు పెరిగాయి. తమిళ సినిమాల్లో ఆమె పెర్ఫార్మెన్స్ చూసిన చాలామంది దర్శకులు ఆమెకు ఆఫర్లు ఇస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలో కాకుండా ఆమె చేతిలో ఇంకో రెండు సినిమాలున్నట్టు తెలుస్తోంది. అవి కూడా పెద్ద హీరోల్ సినిమాలట. అయితే ఆ హీరోలు ఎవరు, ఇంతకీ వారు కోలీవుడ్ హీరోలా లేకపోతే టాలీవుడ్ హీరోలా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతితో ఒక సినిమా, సిద్ధార్థతో ‘సైతాన్ కా బచ్చా ‘ అనే మరొక సినిమా చేస్తున్న రాశీ తెలుగులో నాగ చైతన్య సరసన ‘వెంకీ మామ’, సాయి ధరమ్ తేజ్ సరసన ఇంకో సినిమా త్వరలో మొదలుకానున్న క్రాంతి మాధవ్, విజయ్ దేవరకొండల కొత్త సినిమాను చేస్తోంది.

సంబంధిత సమాచారం :

More