నెగెటివ్ రోల్ నటించనున్న రాశి ఖన్నా !
Published on Apr 10, 2017 9:35 am IST


తెలుగు పరిశ్రమలోని కమర్షియల్ హీరోయిన్లలో రాశి ఖన్నా కూడా ఒకరు. ప్రస్తుతం తెలుగులో ‘ఆక్సిజన్, జై లవ కుశ, టచ్ చేసి చూడు’ వంటి చిత్రాల్లో నటిస్తున్న ఈమె తమిళ, మలయాళ పరిశ్రమల్లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. సాధారణంగా కొత్త పరిశ్రమలోకి అడుగుపెట్టేప్పుడు అందరు హీరోయిన్లు గ్లామరస్ పాత్రలు వీలుంటే కథానాయకి స్థానంలోనే నటనకు ఆస్కారమున్న పాత్రలు ఎంచుకుంటారు. కానీ రాశిఖన్నా మాత్రం వీటన్నింటికీ విరుద్ధంగా నెగెటివ్ రోల్ ఎంచుకుందట.

మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ఉన్ని కృష్ణన్ డైరెక్ట్ చేస్తున్న ‘విలన్’ చిత్రంలో రాశి ఖన్నా ఒక టఫ్ పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్రలో నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా ఉంటాయని, దాదాపుగా ప్రతి నాయకురాలి తరహా పాత్రని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ పాత్ర తాలూకు షూటింగ్ కూడా రెండు రోజుల క్రితమే మొదలైందని రాశి ఖన్నా తన పేస్ బుక్ ద్వారా తెలిపారు. ఇకపోతే ఈ చిత్రంలో తెలుగు నటుడు శ్రీకాంత్, తమిళ నటుడు విశాల్, హన్సిక లు కూడా పలు కీలక పాత్రల్లో నటించనున్నారు.

 
Like us on Facebook