“రాధే శ్యామ్” కి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారా.?

Published on Aug 21, 2021 12:01 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కాంబోలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. వింటేజ్ ప్యూర్ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే ప్రధాన పాత్రధారుల షూట్ అంతా ముగిసిపోయినా మళ్ళీ మేకర్స్ ఒక మూడు రోజుల షూట్ ని ఇటీవల స్టార్ట్ చేసారు. నిన్ననే మొదలైన ఈ చిత్ర షూట్ గండికోట ప్రాంతంలో శరవేగంగా కొనసాగుతుంది.

అయితే ఈ షూట్ పై మరింత ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుస్తున్నాయి. ఈ షూట్ ని ఆల్రెడీ భారీ సెట్టింగ్స్ లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే కానీ దీనికి మించిన ప్లానింగులే ఈ షూట్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. లేటెస్ట్ గా కొన్ని ఫోటోలు రాధే శ్యామ్ షూట్ లోవి అంటూ వైరల్ అవుతున్నాయి.

ఇందులో అఘోరాలు కొన్ని త్రిశూలాలు అంతా ఇంకో రేంజ్ లో కనిపిస్తుంది. మరి ఈ షూట్ ఈ సినిమాకి సంబంధించిందే అని టాక్. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మరోపక్క రాధా ఏం ప్లాన్ చేస్తున్నాడా అని డార్లింగ్ ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.

సంబంధిత సమాచారం :