ఫుల్ హ్యాపీ అంటున్న ప్రభాస్ డైరెక్టర్

Published on Jan 26, 2020 10:06 pm IST

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మూడవ షెడ్యూల్ ఇటీవలే హైదరాబాద్ నగరంలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మొదలై నిన్నటితో ముగిసింది. సుమారు రూ.3 కోట్ల వ్యయంతో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి ఈ సెట్ నిర్మించారు. ఈ సెట్లో షూట్ చేసిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని, ఔట్ పుట్ బాగుందని డైరెక్టర్ రాధాకృష్ణ అంటున్నారు. అంతేకాదు వెండితెర మీద ప్రభాస్, పూజా హెగ్డేల కెమిస్ట్రీ చూడటానికి చాలా బాగుంటుందని చెప్పుకొచ్చారు.

దర్శకుడి మాటలతో డార్లింగ్ ఫ్యాన్స్ చాలా సంతృప్తిగా ఉన్నారు. వీలైనంత త్వరగా సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేయమని కోరుతున్నారు. గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా రూపొందించి ఇతర భాషల్లోకి అనువదిస్తారట. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇకపోతే కొత్త షెడ్యూల్ కోసం టీమ్ త్వరలోనే ఆస్ట్రియా వెళ్లనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More