గూస్ బంప్స్ ఇచ్చేలా “రాధే శ్యామ్” బ్యాక్గ్రౌండ్ స్కోర్.!

Published on Nov 13, 2021 8:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాపై అనేక అంచనాలు కూడా నెలకొన్నాయి. అయితే ఈ భారీ సినిమా నుంచి మ్యూజిక్ ఫెస్టివల్ కోసం అంతా ఎపుడు నుంచో ఎదురు చూస్తున్నారు.

పైగా ప్రభాస్ నుంచి చాలా కాలం తర్వాత ఒక కంప్లీట్ లవ్ స్టోరీ కావడం ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక నిన్ననే ఈ సినిమా మ్యూజిక్ కి సంబంధించి కీలక అప్డేట్ చిత్ర యూనిట్ అందించగా ఇప్పుడు ఈ సినిమాకి హిందీ ఆల్బమ్ పై వర్క్ చేసిన కంపోజర్ మనన్ భరద్వాజ్ ఎగ్జైట్ అవుతున్నాడు.

ఎన్నో నిద్ర లేని రాత్రులు, ఎడిటింగ్స్, రికార్డింగ్స్ ఫైనల్ గా తమ హానెస్ట్ అటెంప్ట్ రాధే శ్యామ్ మ్యూజిక్ ని ప్రెజెంట్ చేసే సమయం వచ్చింది అని ఎగ్జైట్ అవుతున్నాడు. అంతే కాకుండా తన ఇన్స్టా స్టోరీలో ఈ పోస్ట్ తో పెట్టిన మ్యూజిక్ అయితే అవుట్ స్టాండింగ్ గా ఉంది. ఇదే బహుశా సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమో కానీ చాలా ఎఫెక్టీవ్ గా అయితే ఇది ఉంది. ఇంకా సరైన సీన్ లో ఈ స్కోర్ విజువల్ పడితే మాత్రం గూస్ బంప్స్ గ్యారెంటీ.

సంబంధిత సమాచారం :

More