“రాధే శ్యామ్” గ్లింప్స్ ఖాతాలో ఇండియన్ రికార్డ్.!

Published on May 2, 2021 6:02 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ దర్వాకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. అలాగే ఈ సినిమా కోసం పాన్ ఇండియన్ వైడ్ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో కూడా తెలుసు. దానికి ఉదాహరణగానే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ బట్టే అర్ధం అయ్యింది.

అప్పుడు మన ఇండియా లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ సినిమా అయిన RRR ను ఈ సింపుల్ లవ్ స్టోరీతో ప్రభాస్ క్రాస్ చేసాడు. ఇప్పుడు ఇదే గ్లింప్స్ మొత్తం 5 లక్షల లైక్స్ సాధించి ఫస్ట్ ఎవర్ గ్లింప్స్ గా రికార్డ్ సెట్ చేసింది.దీనితో ప్రభాస్ ఖాతాలో మరో సాలిడ్ రికార్డ్ పడ్డట్టు అయ్యింది. ఇక ఈ భారీ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు పని చేస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :