రాధే శ్యామ్ రిలీజ్ డేట్ అదే?

Published on Jul 15, 2020 1:36 pm IST

ప్రభాస్ లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ విశేష స్పందన దక్కించుకుంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే ప్రభాస్ ఓ రొమాంటిక్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాలో నటిస్తున్నాడని అర్థం అవుతుంది. ప్రభాస్ బాహుబలి 1 విడుదలైన జులై 10న ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. కాగా రిలీజ్ విషయంలో కూడా ప్రభాస్ బాహుబలి సెంటిమెంట్ ని ఫాలో అయ్యే సూచనలు కలవు. రాధే శ్యామ్ విడుదల 2021లో అని ధృవీకరించిన చిత్ర బృందం బాహుబలి 2 విడుదల తేదీ అయిన ఏప్రిల్ 24న విడుదల చేసే అవకాశం కలదు. ప్రభాస్ ఈ రిలీజ్ డేట్ నే టార్గెట్ చేశాడని కొందరు భావిస్తున్నారు.

ఇప్పటికే రాధే శ్యామ్ 50 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ పీరియాడిక్ లవ్ డ్రామా తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా చిత్రంగా నాలుగు భాషలలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు.

సంబంధిత సమాచారం :

More