తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన “రాధే శ్యామ్”.!

Published on Jun 11, 2022 3:02 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. యంగ్ దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కింది. అయితే బాక్సాఫీస్ పరంగా అంత గొప్ప విజయం అందుకోకపోయినా ఆడియెన్స్ నుంచి మాత్రం మంచి ఫీడ్ బ్యాక్ ను అందుకుంది.

మరి ఈ చిత్రం ఇప్పుడు ఫైనల్ గా మన తెలుగు స్మాల్ స్క్రీన్ పై టెలికాస్ట్ కి సిద్ధం అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులని జీ సంస్థ వారు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ హిందీలో ఈ సినిమా టెలికాస్ట్ కూడా అవ్వగా ఇప్పుడు తెలుగులో వరల్డ్ తెలివిజ ప్రీమియర్ గా సిద్ధం అయ్యింది. మరి జీ తెలుగు ఛానెల్లో ఈ సినిమా ప్రసారం కి రానుండగా దీనికి ఇంకా డేట్ రావాల్సి ఉంది. మరి మన తెలుగు బుల్లితెరపై అయితే ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :