ఆసక్తి రేపుతున్న “నెట్” చిత్రం ట్రైలర్.!

Published on Aug 19, 2021 11:08 am IST


టాలీవుడ్ లో ఉన్న పలువురు యంగ్ అండ్ టాలెంటెడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ కూడా ఒకడు. ఎన్నో చిత్రాల్లో తనదైన పాత్రలో ఆకట్టుకున్న రాహుల్ ఇప్పుడు ఓ ఆసక్తికర చిత్రంలో మెయిన్ లీడ్ లో నటించి రిలీజ్ కి సిద్ధం అవుతున్నాడు. స్ట్రీమింగ్ యాప్ జీ 5 లో డైరెక్ట్ స్ట్రీమింగ్ కే ఓటిటి రిలీజ్ తో వస్తున్న తన సినిమా “నెట్”. ఇప్పుడు దీని ట్రైలర్ నే మేకర్స్ రిలీజ్ చేశారు.

భార్గవ్ మాచర్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్ ఇందులో లక్ష్మణ్ అనే పాత్రలో కనిపిస్తున్నాడు. తనకి ఒక భార్య కాకపోతే తాను ఒక సర్వేలైన్స్ ఏజెన్సీ లో వర్క్ చేస్తూ సీసీ కెమెరాస్ చెక్ చేస్తూ ఉంటాడు. అయితే అంతర్జాలం కోసం తెలిసిందే కదా తన ఫోన్ నుంచి ఎక్కడెక్కికో ఎవరెవరి జీవితాలనో చెక్ చేస్తూ ఉంటాడు. ఇందులో హీరోయిన్ అవికా గోర్ కూడా కనిపిస్తుంది.

ఇలా చూస్తూ కొనసాగే లక్ష్మణ్ లైఫ్ లో అదే ఫోన్ లో చూసిన ఒక వీడియో ఎలా మలుపు తిప్పుతుంది అన్న సారాంశం, మరిన్ని ఆసక్తికర సన్నివేశాలు ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా ఓటిటి వీక్షకులకు ఆద్యంతం ఆసక్తికరంగా అనిపిస్తూ ఉండొచ్చు. ఇక ఈ చిత్రానికి నరేష్ కుమ్రన్ సంగీతం అందివ్వగా తమడ మీడియా వారు నిర్మాణం వహించారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూడాలి అనుకుంటే వచ్చే సెప్టెంబర్ 10న జీ 5 లో స్ట్రీమ్ కానుంది అందులో చూడొచ్చు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :