ఫైటర్ లుక్ ఎలా ఉండబోతుంది…?

Published on Aug 26, 2019 8:47 am IST

క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాధ్, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఓ మూవీ రానున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఫైటర్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మించనున్నారని తెలుస్తుంది.

ఐతే విజయ్ ఈ చిత్రంలో మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ గా చేస్తున్న నేపథ్యంలో ఆయన లుక్ పై అప్పుడే ఆసక్తి పెరిగిపోయింది. హీరోల లుక్ నుండి ఆటిట్యూడ్ వరకు సరికొత్తగా చూపించడంలో సిద్ధహస్తుడైన పూరి తమ రౌడీ హీరోని ఎలా చూపించనున్నారని దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీలో రామ్ ని ఊర మాస్ తెలంగాణా పోరగాడిగా చూపించి మంచి మార్కులు కొట్టేసిన పూరి, తెలంగాణా పోరగాడైన విజయ్ ని ఇంకెంత విభిన్నంగా చూపించనున్నాడో చూడాలి మరి.

సంబంధిత సమాచారం :