రాయలసీమ కుర్రాడిగా రాజ్ తరుణ్ !
Published on Mar 1, 2018 7:40 pm IST

హీరో రాజ్ తరుణ్ రంగుల రాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తరువాత రాజుగాడు సినిమాను సిద్ధం చేస్తున్నాడు ఈ హీరో. ఈ మూవీ తో పాటు దిల్ రాజు నిర్మాణంలో తెరకేక్కబోతున్న లవర్ సినిమా నటిస్తున్నాడు రాజ్ తరుణ్. అలా ఎలా సినిమాకు దర్శకత్వం వహించిన అనిష్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

రోమాంటిక్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న లవర్ సినిమాను ఈ ఏడాది జూన్ 14న విడుదల కానుంది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన రిద్ధి కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. రాజ్ తరుణ్ గెటప్ బాడి లాంగ్వేజ్ మాస్ గా ఉండబోతుందని సమాచారం. రాయలసీమ కుర్రాడిగా రాజ్ తరుణ్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. సినిమా చిత్రీకరణ కూడా ఎక్కువ భాగం అనంతపురం పరిసర ప్రాంతాలో జరిగింది.

 
Like us on Facebook