‘రాజా ది గ్రేట్’ లేటెస్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ !
Published on Oct 22, 2017 8:50 pm IST

మాస్ మహారాజ రవితేజ ‘రాజా ది గ్రేట్’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. నాలుగు రోజులకుగాను రూ.15.73 కోట్ల షేర్ ను వసూలు చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.31 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే ప్రీమియర్ల ద్వారా 1.33 లక్షల డాలర్లను రాబట్టిన ఈ చిత్రం మూడు రోజులకు కలిపి 2 లక్షల డాలర్లను రాబట్టుకుంది.

ఇక శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టి 40,886 డాలర్లను వసూలు చేసి శనివారం కొద్దిగా మెరుగైన ప్రదర్శనతో 54,871 డాలర్లను కలెక్ట్ చేసింది. దీంతో మొత్తంగా శనివారం వరకు కలిపి 295,800 డాలర్లు అనగా రూ. 1.92 కోట్లను ఖాతాలో వేసుకుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాగా ఓవరాల్ పెర్ఫార్మెన్స్ పరంగా రవితేజకు మంచి కమ్ బ్యాక్ చిత్రంగా నిలవనుంది. అంతేగాక ఆయన కెరీర్లోనే బేస్ ఓపెనింగ్స్ ను సాధించిన చిత్రం కూడా ఇదే కావడం విశేషం.

 
Like us on Facebook