ఓటిటి : అంత నెగిటివ్ లో కూడా అదరగొడుతున్న “ది ఫ్యామిలీ స్టార్”

ఓటిటి : అంత నెగిటివ్ లో కూడా అదరగొడుతున్న “ది ఫ్యామిలీ స్టార్”

Published on Apr 30, 2024 10:32 AM IST

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన రీసెంట్ ఫ్యామిలీ డ్రామా చిత్రం “ది ఫ్యామిలీ స్టార్”. అయితే గీతా గోవిందం తర్వాత విజయ్ పరశురామ్ నుంచి వస్తున్నా రెండో సినిమా పైగా మృణాల్ ఠాకూర్ హిట్ స్ట్రీక్ లో ఉన్న సమయంలో వస్తున్నా సినిమా కావడంతో ఇది కూడా హిట్ అవుతుంది అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా వేరే ఫలితాన్ని ఈ చిత్రం అందుకుంది.

మరి ఈ చిత్రం రీసెంట్ గానే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి రాగా ఇక్కడ కూడా నెగిటివ్ కామెంట్స్ తోనే స్టార్ట్ అయ్యింది. కానీ ఓటిటిలో మాత్రం ఈ చిత్రం అదరగొడుతుంది అని చెప్పాలి. ఇండియా వైడ్ గా ఈ చిత్రం నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇంకా హిందీ వెర్షన్ లాంటిది ఏమి రాకుండా ఇండియా వైడ్ గా ఈ సినిమా ఇప్పుడు ట్రెండింగ్ లోకి రావడం విశేషం. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు