‘రాజా ది గ్రేట్’ టీజర్ రిలీజ్ డేట్ !
Published on Jul 31, 2017 10:49 am IST


మాస్ మజారాజ రవితేజ అంధుడిగా నటిస్తున్న ప్రయోగాత్మక చిత్రం ‘రాజా ది గ్రేట్’ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుంది. ఇంకో 30 శాతం చిత్రీకరణ మాత్రమే మిగిలుంది. ఈ ఏడాది అక్టోబర్ 12న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్న టీమ్ ముందుగా ఆగష్టు 15న టీజర్ ను రిలీజ్ చేయనున్నారట.

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫేమ్ మెహరీన్ కౌర్ నటిస్తుండగా శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook