ప్రేమ కథలు చూడను.. అయినా ‘తొలిప్రేమ’ నచ్చింది – రాజమౌళి
Published on Feb 12, 2018 3:01 pm IST

గత వారం విడుదలైన ‘తొలిప్రేమ’ చిత్రం ప్రేక్షకులను, విమర్శకుల ప్రశంసలతో పాటు పలువురు సినీ పెద్దల మన్ననలు కూడా పొందుతోంది. ఇప్పటికే రాఘవేంద్రరావు, ఆర్. నారరాయణమూర్తి వంటివారు సినిమాను కొనియాడగా తాజాగా వాళ్ళ జాబితాలోకి దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కూడా చేరారు. కొద్దిసేపటి క్రితమే అయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియపారు.

సాధారణంగా ప్రేమ కథల్ని పెద్దగా చూడనన్న రాజమౌళి ‘తొలిప్రేమ’ చిత్రాన్ని మాత్రం ఎంజాయ్ చేశానాని అన్నారు. దర్శకుడు వెంకీ తన తొలి చిత్రాన్ని బాగానే హ్యాండిల్ చేశారని, వరుణ్ తేజ్ రోజు రోజుకి బలమైన నటుడిగా ఎదుగుతున్నాడని, రాశీఖన్నా అందంగా కనిపిస్తూనే బాగా నటించిందని, ప్రసాద్, బాపినీడుల నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయని అందరినీ ప్రశంసించారు.

 
Like us on Facebook