ఏపి అసెంబ్లీ కోసం అద్భుతమైన ఐడియా ఇచ్చిన రాజమౌళి !

తెలుగు వెండి తెరపై తన ఊహాశక్తితో ఎన్నో అద్భుతాల్ని కళ్ళకు కట్టిన దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పుడు ప్రత్యక్ష అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమయ్యారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు అసెంబ్లీ నిర్మాణంలో రాజమౌళి సలాహాలు, సూచనల్ని కోరిన సంగతి విధితమే.

దీంతో పరిశోధనలో పడిన జక్కన్న అద్భుతమైన ఐడియాను అందించారు. శ్రీకాకుళంలోని అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయం, తిరుపతిలోని గుడిమల్లం పరశురామేశ్వర దేవాలయం, పుడిచ్చేరిలోని మాత్రి మందిర్ లలో ఉండే టెక్నాలజీని వాడుకొని అసెంబ్లీ సెంట్రల్ హలో ప్రతిష్టించబోయే తెలుగు తల్లి విగ్రహం మీదకు సూర్య కిరణాలు ప్రసరించే విధంగా సన్ లైట్ రిఫ్లెక్షన్ పరికరాన్ని అమర్చాలని సూచించారు. దీనికి సంబందించిన సవివరమైన రెండు నిముషాల వీడియోని సైతం పోస్ట్ చేశారు.