బల్గేరియాలో రాజమౌళి మల్టీస్టారర్ !

Published on Aug 25, 2019 9:35 pm IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక యూరోపియన్ దేశంలోని బల్గేరియాలో రాజమౌళి ఇప్పటికే బాహుబలి 2 యాక్షన్ సీక్వెన్స్ స్ ను షూట్ చేశాడు. కాగా తాజాగా ఇప్పుడు, రాజమౌలి క్రేజీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ కోసం కూడా బల్గేరియాను సందర్శిస్తున్నారట. రాజమౌలి తన చిత్రబృందంతో 3 వారాల పాటు సాగే సుదీర్ఘ షెడ్యూల్ కోసం బల్గేరియాలో షూట్ ప్లాన్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పై కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించనున్నారు.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ మరోసారి లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేస్తున్నాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. జులై 30, 2020 లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :