“ఆర్ ఆర్ ఆర్” లో ప్రముఖ పాత్రల ఎంట్రీ సీన్స్ కొరకే 60కోట్లు…!

“ఆర్ ఆర్ ఆర్” లో ప్రముఖ పాత్రల ఎంట్రీ సీన్స్ కొరకే 60కోట్లు…!

Published on Jul 10, 2019 12:06 PM IST

“ఆర్ ఆర్ ఆర్” చిత్రం రోజుకొక సెన్సేషనల్ వార్తతో పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచివేస్తుంది.ఈ మూవీకి దర్శకుడు రాజమౌళి కావడంతో పాటు,టాలీవుడ్ ఇద్దరు టాప్ స్టార్స్ నటిస్తుండటంతో ఈ మూవీ పై క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతంగా పెరిగిపోయింది. ఈ మూవీ గురించిన ఎటువంటి వార్త అయినా సంచలనంగా మారిపోతుంది. వేరువేరు నేపధ్యాలు కలిగిన ఇద్దరు స్వాతంత్ర్య యోధులైన కొమరం భీమ్,అల్లూరి సీతారామరాజు ల చరిత్రకు కొంచెం ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్న నేపథ్యంలో వీరిద్దరి ఎంట్రీ సీన్స్ కొరకే 45కోట్ల ఖర్చుతో తెరకెక్కించారట.

ఐతే ఈ మూవీలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో కొద్ది నిమిషాలే కనిపించే ఆయన పాత్ర ఎంట్రీ సీన్ కూడా 12కోట్లతో తెరకెక్కించనున్నారట రాజమౌళి. ఇలా కేవలం సినిమాలోని ప్రముఖ పాత్రల ఎంట్రీ సన్నివేశాలకోసమే దాదాపు 60కోట్ల బడ్జెట్ కేటాయించిన రాజమౌళి ఈ మూవీని విజువల్ వండర్ గా తెరకెక్కిస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఈ చిత్రం ఉత్తర భారత దేశంలో అలియా భట్ ,చరణ్ ల మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు