విజయ్ స్టైల్ ను ఫాలో కానున్న పవన్, రజనీ !
Published on Oct 11, 2017 9:17 am IST

ప్రస్తుతం తమిళ పరిశ్రమలో విజయ్ చిత్రం ‘మెర్సల్’ హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఆ సినిమా గురించిన చర్చే. సోషల్ మీడియా అయిన ట్విట్టర్లో అయితే ఈ చిత్రం ఎప్పటికప్పుడు టాప్ ట్రెండ్స్ లో నిలుస్తూనే వస్తోంది. ముఖ్యంగా ఈ చిత్రం కోసం మేకర్స్ తయారుచేయించిన విజయ్ ను పోలిన ట్విట్టర్ ఎమోజి అయితే విపరీతంగా సక్సెస్ అయి సినిమాకు బోలెడు ప్రచారాన్ని కల్పిస్తోంది. మెర్సల్ అనే హ్యాష్ ట్యాగ్ టైపు చేస్తే వెంటనే విజయ్ ఎమోజి దర్శనమిస్తోంది.

అందుకే మరొక ఇద్దరు సౌత్ స్టార్ హీరోలైన పవన్, రజనీకాంత్ ల సినిమాలు కూడా అదే స్టైల్ ను ఫాలో కానున్నాయి. పవన్ – త్రివిక్రమ్ ల కలయికలో రూపొందుతున్న నూతన చిత్రం యొక్క నిర్మాతలు, రజనీ – శంకర్ ల కాంబోలో వస్తున్న ‘రోబో-2’ మేకర్స్ ట్విట్టర్లో ఆయా సినిమాల యొక్క ఎమోజీలను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి విజయ్ ఎమోజి సాదించినట్టుగా పవన్, రజనీల ఎమోజిలు కూడా సూపర్ సక్సెస్ ను సాదిస్తాయేమో చూడాలి.

 
Like us on Facebook