యాక్షన్ సీన్స్ ని పూర్తి చేసిన సీనియర్ హీరో !

Published on Dec 3, 2018 11:00 pm IST

యంగ్ డైరెక్టర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో సీనియర్ హీరో డా రాజ‌శేఖ‌ర్ హీరోగా ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం 1983 నేపథ్యంలో సాగుతుందని.. కథ కూడా ఆ కాలానికి తగ్గట్లు రొటీన్ కి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. గరుడవేగ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత డా రాజ‌శేఖ‌ర్ నటిస్తుండటం, మంచి టాలెంటెడ్ డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమా పై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఎక్కడా కాంప్రమైజ్ ఈ సినిమాను తెరకెక్కీస్తున్నారు.

కాగా, హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ చిత్రంలోని కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాల షూటింగ్ ను చిత్రబృందం పూర్తి చేసుకుంది. ఆ సన్నివేశాల్లో రాజశేఖర్ డూప్ లేకుండా నటించారు. అయితే ఈ సినిమా కోసం రాజ‌శేఖ‌ర్ రిస్క్ చేసి మరి.. ఫైట్స్, జంప్స్ వంటి రిస్కీ షాట్స్ కూడా చేస్తున్నారట. మరి గరుడవేగ లాగే ఈ చిత్రం కూడా రాజశేఖర్‌ కి భారీ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :