‘2 పాయింట్ 0’ విడుదలపై స్పందించిన రజనీకాంత్ !

దక్షిణాది ప్రేక్షకులతో పాటు భారతీయ సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘2 పాయింట్0’. ఈ సినిమాను కొన్ని రోజులు ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని ఆ తర్వాత తేదీ ఏప్రిల్ 27 కు మారిందని నిర్మాతలు చెప్పగా ఇప్పుడు సినిమా వేసవి ఆఖరున లేదా ఆగస్టులో రిలీవుతుందని బలమైన వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా జరిగన మీడియా సమావేశంలో రజనీ మాట్లాడుతూ ‘వి.ఎఫ్.ఎక్స్ పనులు మిగిలున్నాయి. టీమ్ వాటిని అనుకున్న సమయానికి పూర్తిచేయడానికి చాలా కష్టపడుతున్నారు. అనుకున్న సమయానికే విడుదలచేయాలని ప్రయత్నిస్తున్నాం. ఇంకో రెండు రోజుల్లో ఖచ్చితమైన ప్రకటన ఉంటుంది’ అన్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి శంకర్ త్రీడీలో చిత్రీకరించగా హాలీవుడ్ కు చెందిన వి.ఎఫ్.ఎక్స్ నిపుణులు ఈ సినిమాపై పనిచేస్తున్నారు.