‘పెటా’ నుండి మొదటి సాంగ్ విడుదల కానుంది !

Published on Dec 2, 2018 2:11 pm IST

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెటా’ నుండి మొదటి పాట విడుదలకానుంది. ప్రముఖ గాయకుడు ఎస్ పి బాలసుబ్రమణ్యం పాడిన ‘మరాన మాస్’ అనే సాంగ్ ను రేపు సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. ఈ సాంగ్ ని వివేక్ రచించాడు. ఇక ఈచిత్రం యొక్కఆడియో విడుదల వేడుక డిసెంబర్ 9న చెన్నై లో గ్రాండ్ గా జరుగనుంది . పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రానున్న ఈచిత్రంలో రజినీ రెండు డిఫ్రెంట్ గెటప్ లలో కనిపించనున్నాడు.

సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నవాజుద్దిన్ సిద్దిఖీ , విజయ్ సేతుపతి , సిమ్రాన్ , త్రిష , మెగా ఆకాష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ రవి చంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ కానుకగా విడుదలకానుంది. ఇక ప్రస్తుతం రజినీ నటించిన ‘2.0’ ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తుంది. ఇటీవల వరుస పరాజయాలను చవిచూసిన తలైవా ఈ చిత్రం తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.

సంబంధిత సమాచారం :