రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్ళిపోయిన ‘రోబో 2’
Published on Oct 4, 2016 2:56 pm IST

robot
సూపర్ స్టార్ రజనీ కాంత్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ప్రభంజనం ‘రోబో’కి సీక్వెల్‌గా ప్రస్తుతం ‘రోబో 2’ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందన్న ప్రచారం పొందుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్ చెన్నై శివార్లలోని చిన్న చిన్న ఊర్లలో జరుగుతోంది.

రజనీ కాంత్, అమీ జాక్సన్ పాల్గొంటుండగా ప్రస్తుతం కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఓ కొత్త అనుభూతినిస్తుందని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. రజనీ కాంత్ కొద్ది నెలలుగా అనారోగ్యంగా ఉండడంతో సినిమా షూటింగ్ ఈ సమయంలో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడిక రజనీ మళ్ళీ తన ఎనర్జీతో సెట్లో జాయిన్ అయిపోవడంతో టీమ్ ఉత్సాహవంతంగా పనిచేస్తోంది.

 
Like us on Facebook