ఆ రోజున ఓటిటి లో రిలీజ్ కానున్న రజినీకాంత్ ‘లాల్ సలాం’ ?

ఆ రోజున ఓటిటి లో రిలీజ్ కానున్న రజినీకాంత్ ‘లాల్ సలాం’ ?

Published on Mar 18, 2024 4:10 PM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక ముఖ్య పాత్రలో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగిన యాక్షన్ డ్రామా మూవీ లాల్ సలాం. ఫిబ్రవరి 9న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా విజయం అందుకోలేకపోయింది.

ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్ ప్రకారం లాల్ సలాం మూవీ మార్చి 21న ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ద్వారా ఓటిటి ఆడియన్స్ ముందుకి రానున్నట్లు చెప్తున్నారు. అయితే దీని పై నెట్ ఫ్లిక్స్ టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ మాత్రం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు