రజనీ సినిమా స్టోరీ కాపీ కాదు

Published on Jan 24, 2020 2:13 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లింగా’ చిత్రం 2014లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ డైరెక్ట్ చేయగా రాక్ లైన్ వెంకటేష్ నిర్మించారు. ఈ సినిమా విడుదల సమయంలో స్టోరీ కాపీ కొట్టారంటూ డైరెక్టర్ రవిరత్నం మధురై కోర్టులో కేసు వేశారు. కథను తన ‘ముల్లై వానమ్ 999’ సినిమా నుండి తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

అప్పట్లో ఈ కేసు చాలానే దుమారం రేపింది. కోర్టు రూ.10 కోట్ల ఇన్సూరెన్స్ మీద సినిమా విడుదలకు అనుమతించింది. ఇన్నాళ్ళు విచారణలో ఉన్న ఈ కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. కథ కాపీ కాదని తీర్పును వెలువరించింది. దీంతో నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ కు పెద్ద ఊరట లభించినట్లైంది. ఇకపోతే ఇటీవలే ‘దర్బార్’ చిత్రంతో పలకరించిన రజనీ ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :