రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న రజనీ ‘కాల’ !
Published on Oct 25, 2017 4:21 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ చేస్తున్న చిత్రాల్లో ‘కాల’ కూడా ఒకటి. పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పటీకే రజనీ తాలూకు షూట్ పూర్తవగా మొత్తం షూటింగ్ అక్టోబర్ చివరికి ముగియనుంది. ఇక అప్పటి నుండి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టనున్నారు టీమ్. ఈ వర్క్ కోసం కాస్త ఎక్కువగానే టైమ్ కేటాయించారు.

సుమారు 5 నెలల పాటు ఈ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరగనుంది. ఇది పూర్తయ్యేనాటికి ఏప్రిల్ పడుతుంది కాబట్టి సినిమాను ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇకపోతే పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బలమైన రాజకీయ కోణం ఉంటుందని, రజనీ అణచివేతకు గురైన తమిళ తరపున పోరాడే వ్యక్తిగా కనిపిస్తారని టాక్.

 
Like us on Facebook