రాజు గారి గది 2 తొలిరోజు వసూళ్లు ఎంతంటే !
Published on Oct 14, 2017 12:58 pm IST

నాగార్జున, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన రాజు గారి గది 2 చిత్రం నిన్న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందు భారీ ప్రమోషన్ నిర్వహించడంతో తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లనే రాబట్టింది. ఓం కార్ ఈ చిత్రానికి దర్శకుడు. హర్రర్ కామెడీ గా వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున, సమంతల పాత్రలు అలరించాయి.

తొలిరోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.93 కోట్ల వసూళ్లు సాధించింది. ఏరియాల వారీగా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా కలెక్షన్లు
నైజాం    1.51 కోట్లు
సీడెడ్ 51 లక్షలు
నెల్లూరు 14 లక్షలు
గుంటూరు 47 లక్షలు
కృష్ణా 27 లక్షలు
వెస్ట్ 26 లక్షలు
ఈస్ట్ 36 లక్షలు
వైజాగ్ 41 లక్షలు
మొత్తం షేర్ 3.93 కోట్లు

 
Like us on Facebook