మోదీ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా రకుల్ ప్రీత్ !
Published on Oct 12, 2017 4:34 pm IST

తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాని నరేందట మోదీ తలపెట్టిన ఒక సామాజిక కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికైంది. ఆ కార్యక్రమమే ‘భేటీ బచావో.. భేటీ పడావో’. ఈ కార్యక్రమానికిగాను తెలంగాణ తరపు నుండి కేసీఆర్ ప్రభుత్వం ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ‘భేటీ బచావో.. భేటీ పడావో’ అనేది దేశంలోని స్త్రీల అభివృద్ధికిగాను ప్రభుత్వం తలపెట్టిన ప్రముఖ సంక్షేమ కార్యక్రమాల్లో ముఖ్యమైనది.

స్వతహాగానే స్వతంత్ర్య భావాలు కలిగి, సామాజిక అభివృద్ధి పట్ల, స్త్రీల పురోగతి పట్ల ఎక్కువగా శ్రద్ద చూపే రకుల్ ప్రీత్ సింగ్ ఇలా తెలంగాణ ప్రభుత్వం తనను ఈ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఈ మహత్తర కార్యక్రమంలో తానూ ఒక భాగమవడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.

 
Like us on Facebook