అక్కినేని హీరోని కూడా టచ్ చేసిన రకుల్ ప్రీత్ !

22nd, October 2016 - 08:00:29 PM

sarinodu-rakul (1)
ఇటు తెలుగు అటు తమిళ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న నటి ‘రకుల్ ప్రీత్ సింగ్’. ఇప్పటికే ఈమె తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరి సరసనా నటించేసింది. మెగా ఫ్యామిలీ నుండి చరణ్ తో ‘బ్రూస్ లీ’ లో నటించి ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ‘ధృవ’లో సైతం నటిస్తోంది. అలాగే అల్లు అర్జున్ తో ‘సరైనోడు’ వంటి సూపర్ హిట్ లో జోడి కట్టి మరో మెగా హీరో ధరమ్ తేజ్ చేస్తున్న ‘విన్నర్’ లో హీరోయిన్ గా ఫిక్సైంది. ఇక నందమూరి ఫ్యామిలీలో తారక్ తో ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో ఆడిపాడింది.

అంతేగాక సూపర్ స్టార్ మహేష్ బాబు, మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో కూడా రకులే హీరోయిన్. ఇలా స్టార్ హీరోలందరి సరసనా నటించేసిన ఈమె మిగిలిన అక్కినేని ఫ్యామిలీని కూడా టచ్ చేసేసింది. తాజాగా ‘ప్రేమమ్’ సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 7 నుండి మొదలుకానుంది. ఇందులో రకుల్ ప్రీత్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో రకుల్ పరిశ్రమలోని పెద్ద ఫ్యామిలీ హీరోలందరితోనూ నటించేసిన ఘనత దక్కించుకుంది. ఇకపోతే దేవి శ్రీ సంగీతం అందిసున్న ఈ చిత్రంలో జగపతి బాబు, వెన్నెల కిశోర్, పోసాని వంటి వారు కూడా నటిస్తున్నారు.