హౌస్ వైఫ్ పాత్రలో నటించబోతున్న రకుల్ !

31st, January 2018 - 03:53:47 PM

దిల్ రాజు నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సినిమా ‘దాగుడుమూతలు’. శర్వానంద్, నితిన్ ఈ సినిమాలో హీరోలుగా నటించబోతున్నారు. మే నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలో ఈ సినిమాను ఆఫిషియల్ గా అనౌన్స్ చెయ్యబోతున్నారు.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో స్థార్ హీరోయిన్ రకుల్ హౌస్ వైఫ్ పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. ఫ్యామిలి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రకుల్ నితిన్ కు జోడిగా నటించే ఛాన్సుంది. అయితే ఈ వార్తపై ఇంకా చిత్ర సంబంధీకుల నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రంలో నటించే మరోక హీరోయిన్ ఎవరనేది కూడా త్వరలో తెలియనుంది