రామ్ నయా లుక్, విషయం ఏమిటీ?

Published on Aug 3, 2019 11:01 pm IST

రామ్ పోతి నేని రెండు రోజుల క్రితం విదేశీ టూర్ ముగించుకొని వచ్చారు. ఇస్మార్ట్ శంకర్ సెలెబ్రేషన్స్ లో విరివిగా పాల్గొంటున్న రామ్ చాలా క్లాస్ లుక్ లో దర్శనం ఇస్తున్నారు. క్లాసిక్ డ్రెస్ సెన్స్ ఫాలో అవుతూ గాగుల్స్ లో ఆయన అప్పీరెన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆసక్తికరంగా ట్రిమ్డ్ షేవ్ పేస్ కలిగివున్న రామ్ ఎప్పుడు క్యాప్ పెట్టుకొని ఉంటున్నాడు. మరి ఈ మేక్ ఓవర్ తదుపరి మూవీ కోసమా లేకా మరే కారణమైన ఉండ తెలియాల్సివుంది.

కాగా ఇస్మార్ట్ శంకర్ విడుదలై రెండు వారాలు ముగుస్తున్నా, చిత్ర వసూళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 75కోట్ల గ్రాస్ కలెక్షన్స్ “ఇస్మార్ట్ శంకర్” సాధించినట్టు చిత్ర యూనిట్ పోస్టర్ ని విడుదల చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :