అతిపెద్ద స్క్రీన్ కలిగిన ధియేటర్ ని లాంచ్ చేసిన రామ్ చరణ్.

Published on Aug 29, 2019 9:30 pm IST

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ నేడు హీరో రామ్ చరణ్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ‘వి ఎపిక్’ పేరుతో నిర్మించబడిన ఈ థియేటర్ ఆసియాలోనే అతిపెద్ద సిల్వర్ స్క్రీన్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. ఈ ప్రారంభోత్సవానికి వేలాది మంది అభిమానులు తరలిరావడంతో థియేటర్ ప్రాంగణం కిక్కిరిసి పోయింది.

యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వాములతో ఒకరైన వంశీ ఈ థియేటర్ నిర్మాణంలో ప్రధాన భాగస్వామిగా ఉన్నారని తెలిసింది. రేపువిడుదల కానున్న ‘సాహో’ సినిమాతో ఈ థియేటర్‌లో సినిమాల సందడి షురూ కానుంది. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతులమీదుగానే ఈ బిగ్ స్క్రీన్ థియేటర్ ప్రారంభం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది థియేటర్ యాజమాన్యం.ఇందులో బిగ్ స్క్రీన్ సైజ్ 102.6 అడుగుల వెడల్పు, 56 అడుగుల ఎత్తుతో ఉంటుందట.

సంబంధిత సమాచారం :