తన ఫరెవర్ మెమొరీ అంటూ షేర్ చేసిన చరణ్.!

Published on Mar 3, 2023 12:01 pm IST

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం తెలిసిందే. మరి ఈ సినిమా షూట్ నుంచి బ్రేక్ లో ఉన్న చరణ్ అయితే యూఎస్ లో భారీ తన లాస్ట్ భారీ హిట్ RRR మాసివ్ సక్సెస్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. మరి నిన్న యూఎస్ లో ఉన్న ఏస్ థియేటర్ లో సినిమా స్పెషల్ స్క్రీనింగ్ భారీ కెపాసిటీ తో ఫుల్ కాగా ఈ స్క్రీనింగ్ కి గాను చరణ్ కూడా హాజరయ్యాడు.

అయితే ఇక్కడ అదిరే వెల్కమ్ ని అందుకున్న చరణ్ అయితే ఆ షోలో తన అనుభూతిని ఇప్పుడు పంచుకున్నాడు. ఏస్ హోటల్లో RRR స్క్రీనింగ్ కి ఏమన్నా రెస్పాన్స్ ని ఇచ్చారు మీరు మా సినిమాకి అంతా నిలబడి చప్పట్లో గౌరవించడం అనేది నా ఫరెవర్ మెమొరీలలో ఒకటిగా ఈ దృశ్యం నిలిచిపోతుంది అని చరణ్ అయితే ఈ స్పెషల్ స్క్రీన్ పై ఓ బ్యూటిఫుల్ సెల్ఫీ మరియు తన దర్శకుడు జక్కన్న రాజమౌళి, అండ్ టీం కలిసి తీసుకున్న పిక్స్ తో షేర్ చేసాడు.

సంబంధిత సమాచారం :