“ఢీ” స్టేజ్ పై రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ ఎపిసోడ్.!

“ఢీ” స్టేజ్ పై రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ ఎపిసోడ్.!

Published on Mar 23, 2024 12:59 PM IST


సౌత్ ఇండియా టెలివిజన్ దగ్గర ఉన్నటువంటి పలు పాపులర్ టెలివిజన్ షోస్ లో బిగ్గెస్ట్ డాన్స్ రియాలిటీ షో “ఢీ” కూడా ఒకటి. మరి ఈటీవీ ఛానెల్లో ప్రసారం అయ్యే ఈ అదిరే డాన్స్ షో ఇప్పుడు 17వ సీజన్ లోకి వచ్చి ఇది కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మరి నందు హోస్ట్ గా చేస్తున్న ఈ షో తాలూకా లేటెస్ట్ ప్రోమోని అయితే లేటెస్ట్ గా రిలీజ్ చేయగా సెలెబ్రెటీ డాన్సర్ ల సాలిడ్ పెర్ఫామెన్స్ లతో పాటు మరిన్ని సర్ప్రైజ్ లు కూడా కనిపిస్తున్నాయి.

మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై ఓ స్పెషల్ పెర్ఫామెన్స్ కనిపించగా ఆ సందర్భంగా “అత్తారింటికి దారేది” లో పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రణీత సుభాష్ పవన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అలాగే ఈ ఎపిసోడ్ మార్చ్ 27న టెలికాస్ట్ కానుండగా ఆరోజు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా అయితే ఓ స్పెషల్ ట్రిబ్యూట్ ని కూడా టీం ప్లాన్ చేసినట్టుగా ఈ ప్రోమోలో కనిపిస్తుంది.

పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సహా మొత్తం టీం అంతా రామ్ చరణ్ (Ram Charan) కి కాల్ చేసి విష్ చేసినట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ స్పెషల్ ఎపిసోడ్ డాన్స్ లవర్స్ కి సహా మెగా ఫ్యాన్స్ కి కూడా మరింత స్పెషల్ గా మారనుంది అని చెప్పాలి. మరి ఈ ఎపిసోడ్ ఈ మార్చ్ 27 బుధవారం రాత్రి 9 గంటల 30 నిమిషాలకి ఈటీవీలో ప్రసారం కానుంది. డోంట్ మిస్.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు