చిరంజీవికి పుట్టినరోజు కానుకగా చరణ్ ఏ గిఫ్ట్ ఇవ్వనున్నాడో తెలుసా !
Published on Aug 21, 2016 6:36 pm IST

chiru-ram-charan
మెగా అభిమానులు, మెగా కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు ఇంకొన్ని గంటల్లో రానుంది. అదే చిరంజీవి 61వ పుట్టినరోజు. చిరంజీవి ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకున్నా ఈ సంవత్సరం మాత్రం ఆయనకు చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన హీరోగా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి. అందుకే ఈ వేడుకను ఘనంగా నిర్వహించనున్నారు మెగా కుటుంబ సభ్యులు.

ముఖ్యంగా చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే రేపు తన తండ్రికి ఓ స్పెషల్, సప్రైసింగ్ గిఫ్ట్ ఇవ్వనున్నాడట. అదేమిటంటే ఒక పెయింటింగ్. దీని గురించి చరణ్ మాట్లాడుతూ ‘నాన్నగారంటే నాకు చాలా ఇష్టం. మై డాడ్.. మై హీరో. సెట్లో రెడీ ని చెప్పగానే కెమెరా ముందుకెళిపోతున్నారు. మొదటి సినిమా చేసినట్టు చేస్తున్నారు. నాన్నగారికి పుట్టినరోజు కానుకగా ఓ పెయింటింగ్ ను చాలా ప్రత్యేకంగా వేయించాను. రేపు నాన్నకు ప్రెజెంట్ చేయగానే ఫేస్ బుక్ లో పెడతాను’ అన్నారు.

 
Like us on Facebook