మెగా స్టార్ తో చరణ్ మరోసారా.?

Published on Sep 20, 2020 11:00 am IST

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు ఇద్దరు తండ్రి కొడుకులు తమ తమ సినిమాలుతో బిజీగా ఉన్నారు. చరణ్ “RRR” లాంటి భారీ మల్టీ స్టారింగ్ పీరియాడిక్ డ్రామాలో నటిస్తుండగా మెగాస్టార్ మాత్రం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో చిరుతో పాటుగా చరణ్ కూడా ఒక స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడని తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ చిత్రం అనంతరం చరణ్ చిరుతో మరోసారి స్క్రీన్ ను పంచుకొనే సూచనలు ఉన్నాయని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆచార్య తర్వాత చిరు రెండు రీమేక్ చిత్రాలను లైన్ లో ఉంచారు.

వాటిలో “లూసిఫర్” రీమేక్ కూడా ఒకటి. అయితే ఈ చిత్రంలో కూడా చరణ్ ఒక కీలక పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్న దర్శకుడు వివి వినాయక్ స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసేసి చిరును మెప్పించినట్టు సమాచారం. మరి నిజంగానే ఈ చిత్రంలో చరణ్ ఉన్నాడా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం :

More