కొరటాల శివ – రామ్ చరణ్ ల సినిమా కన్ఫర్మ్ !
Published on Jul 11, 2017 10:48 am IST


మెగా పవర్ స్టార రామ్ చరణ్ తేజ్, స్టార్ డైరెక్టర్ కొరటాల శివల కలయికలో ప్రాజెక్ట్ ఖాయమైంది. ఇదివరకే కొరటాల, చరణ్ తో సినిమా చేయాల్సినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఆరంభమై కూడా కొన్ని కారణాల వలన ఆగిపోయింది. కానీ వీరిద్దరూ కలిసి సినిమా చేయాలనే దృఢ నిశ్చయంతో పనిచేసి ఎట్టకేలకు సినిమాను ఫైనల్ చేశారు.

కొద్దిసేపటి క్రితమే రామ్ చరణ్ పేస్ బుక్ ద్వారా ఈ విషయాన్ని ఫైనల్ చేశారు. రామ్ చరణ్ యొక్క కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ మరియు మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించనున్నాయి. 2018 వేసవికి ఈ సినిమా మొదలుకానుంది. ప్రస్తుతం చరణ్ సుకుమార్ డైరక్షన్లో ‘రంగస్థలం-1985’ చేస్తుండగా కొరటాల మహేష్ బాబుతో ‘భరత్ అనే నేను’ షూట్లో బిజీగా ఉన్నారు.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook