ఇంట్రో సాంగ్ షూటింగ్‌లో రామ్ ‘పండగ చేస్కో’

ఇంట్రో సాంగ్ షూటింగ్‌లో రామ్ ‘పండగ చేస్కో’

Published on Mar 17, 2015 2:00 PM IST

Ram1
తెలుగు యువ హీరోల్లో యాక్టింగ్ విషయంలో, డ్యాన్స్ విషయంలో రామ్‌కి మంచి పేరుంది. తన గత చిత్రాలైన ఒంగోలు గిత్త, మసాలా లాంటి సినిమాలు అనుకున్న రేంజ్‌లో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని, రామ్ పండగ చేస్కో సినిమాలో నటిస్తున్నాడు. ‘బలుపు’ లాంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు గోపిచంద్ మలినేనితో కలిసి పండగ చేస్కో ద్వారా మన ముందుకు వస్తున్నాడు.

తాజా సమాచారం మేరకు పండగ చేస్కో సినిమా షూటింగ్ చివరిదశకు చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పోర్చుగల్‌లో జరుగుతోంది. హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌తో సినిమా యూనిట్ బిజీబిజీగా ఉంది. ఈ సాంగ్ పూర్తవడంతో షూటింగ్ కూడా పూర్తవనుంది. రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహన్ నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు