రామ్ కొత్త సినిమా మొదలయ్యేది ఎప్పుడంటే !
Published on Feb 26, 2018 2:18 pm IST

‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమా తరువాత రామ్, త్రినాద్ రావ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ మార్చి 8 నుండి మొదలుకాబోతోంది. ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చెయ్యబోతునట్లు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా రామ్ చేస్తోన్న 16వ చిత్రం.

త్రినాథ్ రావ్ గత చిత్రాల్లో ఒకటైన ‘సినిమా చూపిస్తా మావా’ తరహాలో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఎక్కువగా ఉండబోతోందని సమాచారం. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో నటించబోయే మరో హీరోయిన్ ఎవరనేది త్వరలో తెలుస్తుంది. దీని తరవాత నూతన దర్శకుడితో రామ్ సినిమా చేసే అవకాశాలున్నాయని సమాచారం. ప్రస్తుతం ఆ సినిమా చర్చల దశలో ఉన్నట్లు సమాచారం.

 
Like us on Facebook