ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి రెడీ అయిన ‘రామారావు ఆన్ డ్యూటీ’

Published on Jul 14, 2022 7:00 pm IST

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా సినిమా రామారావు ఆన్ డ్యూటీ. రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని యువ దర్శకడు శరత్ మండవ తెరకెక్కిస్తుండగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మించారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా అన్నివర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా మంచి హిట్ కొడుతుందని అంటోంది యూనిట్.

ఇక ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ని జులై 16న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన యూనిట్, ట్రైలర్ లాంచింగ్ కోసం స్పెషల్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో సాయంత్రం 5 గం.ల నుండి ప్రారంభించనున్నట్లు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. విలక్షణ నటుడు వేణు, సిఐ మురళి పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, తనికెళ్ళ భరణి, రాహుల్ రామకృష్ణ తదితరులు ఇతర పాత్రలు చేస్తుండగా మూవీని జులై 29న రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం :