‘రాక్షకుడు’ డైరెక్టర్ తో మాస్ మహారాజా !

Published on Jan 26, 2020 1:00 am IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఏ స్టూడియోస్ పతాకం పై హవీష్ ప్రొడక్షన్లో ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సత్యనారాయణ కోనేరు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నారు. జనవరి 26 రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే అంశాలతో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని రూపొందించనున్నారు.

ఫిబ్రవరిలో ఈ సినిమాని లాంఛనంగా ప్రారంభించి, మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని నిర్మాత తెలిపారు. ‘రాక్షకుడు’ వంటి బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో సత్యనారాయణ కోనేరు ఈ సినిమా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More