ఫిబ్రవరి నుండి మొదలుకానున్న రామ్ కొత్త చిత్రం !
Published on Nov 29, 2017 11:32 am IST

ఈ మధ్యే ‘ఉన్నది ఒకటే జిందగీ’ తో ప్రేక్షకుల్ని పలకరించిన యంగ్ హీరో రామ్ తన తర్వాతి సినిమాకు సిద్ధమవుతున్నారు. నానితో ‘నేను లోకల్’ సినిమా చేసిన దర్శకుడు త్రినాథరావ్ నక్కిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి మొదలుకానుంది.

ఈ చిత్రం పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉంటుందని వినికిడి. రామ్ యొక్క ఈ 16వ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 
Like us on Facebook