‘హలో గురు ప్రేమ కోసమే’ అంటున్న రామ్ !
Published on Mar 8, 2018 8:42 am IST

యంగ్ హీరో రామ్ కొత్త సినిమా కొద్దిసేపటి క్రితమే లాంచ్ అయింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘హలో గురు ప్రేమ కోసమే’ అనే ఆసక్తికరమైన టైటిల్ ను నిర్ణయించారు. ఈ చిత్రాన్ని ‘సినిమా చూపిస్తా మామ, నేను లోకల్’ ఫేమ్ త్రినాథ్ రావ్ నక్కిన డైరెక్ట్ చేయనున్నారు.

ఫన్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రంలో రామ్ కు జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించనుంది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటించనున్నాడు. విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. గతంలో రామ్, దిల్ రాజులు కలిసి ‘రామ రామ కృష్ణ కృష్ణ’ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.

 
Like us on Facebook