హిందీలో రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా సినిమా ‘బేబీ’. నీరజ్ పాండే దర్శకత్వంలో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా కీలక పాత్రలో కనిపిస్తారు. సెప్టెంబర్ 4న ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ నేటితో(సెప్టెంబర్ 9)తో పూర్తయింది. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ వంటి గొప్ప నటులతో కలసి నటించడం చాలా సంతోషంగా ఉంది. అని రానా తెలిపారు. ఈ సినిమాలో తాప్సి హీరోయిన్.
తెలుగులో రానా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘రుద్రమదేవి’ డిసెంబర్ నెలలో విడుదల కానుంది. రాజమౌళి ‘బాహుబలి’లో కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని ప్రచారం జరుగుతుంది.


