టాలీవుడ్ హల్క్ చేతుల మీదుగా అనుష్క ట్రైలర్.!

Published on Sep 20, 2020 5:46 pm IST

బాహుబలి చిత్రంలో మోస్ట్ పవర్ఫుల్ విలన్ భల్లాల దేవునిగా టాలీవుడ్ హల్క్ దగ్గుబాటి రానా అంతే పవర్ ఫుల్ రోల్ దేవసేనగా కనిపించిన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అందించిన పెర్ఫామెన్స్ అనన్య సామాన్యం. అయితే ఇపుడు అనుష్క ఆ చిత్రం తర్వాత చాలా తక్కువ సినిమాల్లోకి ఎక్కువ వ్యవధితో కనిపించింది.

అలా తాను చేసిన మరో మోస్తా అవైటెడ్ చిత్రం “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ హార్రర్ క్రైమ్ థ్రిల్లర్ ఇపుడు నేరుగా ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. వచ్చే అక్టోబర్ 2న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదలకు రెడీ అవుతున్న ఈ చిత్రం కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు.

టీజర్ కు ఇప్పటికే ఎదురు చూస్తున్నారు. ఇపుడు ట్రైలర్ కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న నేపథ్యంలో అందుకు ముహూర్తం కుదిరింది. ఈ చిత్రం ట్రైలర్ రేపు సెప్టెంబర్ 21 మధ్యాహ్నం 1 గంటకు రానా చేతుల మీదుగా లాంచ్ కానుంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉండనుందో చూడాలి. మొత్తం 5 భాషల్లో ప్లాన్ చేసిన ఈ చిత్రంలో మాధవన్, సుబ్బరాజ్, అంజలి, షాలిని పాండేలు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :

More