‘రానా’ భారీ పౌరాణిక చిత్రం మొదలుకానుంది !

Published on Nov 13, 2019 3:00 am IST

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో రానా ప్రధాన పాత్రగా రాబోతున్న భారీ ప్రాజెక్ట్ చిత్రం ‘హిరణ్య కశ్యప’. కాగా ఈ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన సెట్ వర్క్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొదలైంది. ఈ సినిమాలోని కీలక సన్నివేశాల కోసం కొన్ని ప్రత్యేకమైన సెట్లు వేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది నుండి ఈ పౌరాణిక చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుంది. అలాగే ఈ చిత్రంలో విఎఫ్‌ఎక్స్‌ వర్క్ అధికంగా ఉండటం కారణంగా ఈ సినిమాను 150 కోట్లకు పైగా బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు.

అయితే పక్కా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటు షాట్ డివిజన్, ఫొటోగ్రఫీ బ్లాక్స్ తో సహా బౌండ్ స్క్రిప్ట్ ను పూర్తిగా రెడీ చేసుకున్న తరువాతే షూటింగ్ కి వెళ్లాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. మొత్తానికి హిరణ్య కశ్యప చిత్రం తమ బ్యానర్ లోనే అత్యంత భారీ చిత్రంగా సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. దగ్గుబాటి రానా చేయనున్న ఈ క్రేజీ సినిమా పురాణగాధల్లో ఒకటైన ‘హిరణ్య కశ్యపుడు – భక్త ప్రహల్లాద’ల కథ ఆధారంగా రూపొందనుంది.

సంబంధిత సమాచారం :