త్వరలో “రానా నాయుడు” సీజన్ 2

త్వరలో “రానా నాయుడు” సీజన్ 2

Published on Apr 19, 2023 11:07 AM IST

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ యొక్క తొలి ఓటిటి ప్రాజెక్ట్ రానా నాయుడు గత నెలలో నెట్‌ఫ్లిక్స్‌ లో విడుదలైంది. వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలను అందుకుంది ఈ వెబ్ సిరీస్. సుపర్ణ్ వర్మ మరియు కరణ్ అన్షుమాన్ దర్శకత్వం వహించిన ఈ హిందీ వెబ్ సిరీస్‌లో రానా దగ్గుబాటి కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఈ సిరీస్ కి దేశ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఏర్పడింది.

ఈ రోజు ఓటిటి ప్లాట్‌ఫారమ్ వెబ్ సిరీస్ సీజన్ 2 పై అధికారిక ప్రకటన చేయడం జరిగింది. త్వరలో నెట్ ఫ్లిక్స్ లో రానా నాయుడు సీజన్ 2 రానుంది. అదే విషయాన్ని ప్రకటించడానికి ఒక చిన్న వీడియో ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో సుచిత్రా పిళ్లై, గౌరవ్ చోప్రా మరియు సుర్వీన్ చావ్లా ముఖ్యమైన పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు